Share News

నంద్యాలలో ఆర్టీసీ బస్సు, బొలేరో ఢీ.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Oct 06 , 2026 | 07:39 AM

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి ఘాట్‌ రోడ్డులో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు..

నంద్యాలలో ఆర్టీసీ బస్సు, బొలేరో ఢీ.. ఇద్దరి మృతి
Nanyal Road Accident

నంద్యాల, అక్టోబర్ 6: జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలేరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఈడిగ దేవేందర్‌ గౌడ్‌, నితిన్‌ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడటంతో అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా ఘాట్‌ రోడ్డులో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం.. కర్నూలు నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైర్లూటి వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు బొలేరో వాహనం దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.

ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్

Updated Date - Oct 06 , 2026 | 08:47 AM