మహిళల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్రాల కృషి: పెమ్మసాని చంద్రశేఖర్
ABN , Publish Date - Mar 21 , 2026 | 09:12 PM
ఈ రోజు దేశం మొత్తం ఉమెన్ ఎంపవర్‌మెంట్ నినాదంతో గ్రామగ్రామాన ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రూరల్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లఖ్‌పతి దీదీ ఈ కాన్సెప్ట్స్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
విజయవాడ, మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఈ రోజు దేశం మొత్తం ఉమెన్ ఎంపవర్‌మెంట్ నినాదంతో గ్రామగ్రామాన ముందుకు వెళ్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Central Minister Pemmasani Chandrasekhar) వ్యాఖ్యానించారు. రూరల్ డెవలప్‌మెంట్‌లో ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, లఖ్‌పతి దీదీ ఈ కాన్సెప్ట్స్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) విజయవాడలో ఎలీప్ ఆధ్వర్యంలో మహిళల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. నిర్వాహకులు రమాదేవికి, వారి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు.
ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ALEAP), రమాదేవి ఎప్పటి నుంచో కూడా ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ కలిసి లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఒక మంచి ఎగ్జిబిషన్ పెట్టారని పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రకరకాల ప్రొడక్ట్స్, కొత్త కొత్త స్టార్టప్స్, అదేవిధంగా మెచ్యూర్ అయిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఒక ప్లేస్‌లో పెట్టారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు అందరూ వచ్చి ఇలాంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని పిలుపునిచ్చారు. కొన్ని స్టార్టప్స్ చూస్తుంటే చాలా ఇన్నోవేటివ్‌గా గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్లకు ఉన్నటువంటి సమస్యల నుంచి వచ్చిన సొల్యూషన్స్‌లాగా కనిపిస్తున్నాయని వెల్లడించారు.
దటీజ్ రియల్ ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ అని వ్యాఖ్యానించారు. ఒకళ్లు చెప్పకుండా మనమే సమస్యలను పరిష్కరించేలా నిలబడాలని అన్నారు. గ్రామాల నుంచి వచ్చిన మహిళలకు వారి ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయని వివరించారు. రుణాలు ఇప్పించి గ్రూప్‌లను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. రేపు కొంతమందికి చెక్కులు కూడా ఇస్తున్నారని అన్నారు. విజయవాడ ప్రాంతంలో ఆరు రోజుల ఎగ్జిబిషన్ ద్వారా ఇలా ప్రోత్సహించడం మంచి పరిణామమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు
దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News