కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం
ABN , Publish Date - Nov 07 , 2026 | 07:38 PM
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
కృష్ణాజిల్లా, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి ప్రభంజనం సృష్టిస్తుంది. నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అవనిగడ్డ నుంచి తెలుగుదేశం అభ్యర్థి విక్కుర్తి జయలక్ష్మి- 10996 ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. కోడూరు మండలం నుంచి టీడీపీ అభ్యర్థి బొలిశెట్టి అరుణ - 5053 ఆధిక్యంతో విజయం సాధించారు. చల్లపల్లి మండలం నుంచి తెలుగుదేశం అభ్యర్థి రావెల్ల ఉదయ్ కుమార్ - 4980 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. నాగాయలంక మండలం నుంచి బీజేపీ అభ్యర్థి భోగాది రమాదేవి - 3900 ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు.
ఘంటసాల మండలం నుంచి జనసేన అభ్యర్థి దోవారి పవిత్ర - 5790 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మోపిదేవి మండలం నుంచి జనసేన అభ్యర్థి మురాల సీతమ్మ - 5504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని 75 ఎంపీటీసీ స్థానాలకు గానూ తెలుగుదేశం పార్టీ - 33 ఎంపీటీసీ స్థానాలు, జనసేన పార్టీ - 29 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా వైసీపీ - 13 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఒక స్థానంలో తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి గెలిచారు. ఘంటసాల మండలంలో - 11 ఎంపీటీసీ స్థానాలుంటే, ఒక జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకొని కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News