Share News

ఏపీని ప్రపంచస్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మన్నవ మోహనకృష్ణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:10 PM

నూజివీడులో RGUKT, IBM క్వాంటమ్ నిర్వహించిన IBM-Qiskit Fall Fest -2026కు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ప్రారంభించారు.

ఏపీని ప్రపంచస్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మన్నవ మోహనకృష్ణ
IBM-Qiskit Fall Fest -2026

నూజివీడు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT) నూజివీడు క్యాంపస్‌లో IBM Quantum భాగస్వామ్యంతో అక్టోబర్ 5 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న IBM–Plus Qiskit Fall Fest - 2026 కార్యక్రమాన్ని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS ) ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ ప్రారంభించారు.


Mannava-Mohana-Krishna-5.jpg

ఈ సందర్భంగా మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి 29,000 రిజిస్ట్రేషన్లతో రికార్డు స్థాయిలో కనివిని ఎరుగని రీతిలో భారీ స్పందన వచ్చిందన్నారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, పరిశోధకులు, టెక్నాలజీ నిపుణులు వర్చువల్‌గా కార్యక్రమానికి హాజరయ్యారు. క్వాంటం కంప్యూటింగ్‌పై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం అని మోహన కృష్ణ అన్నారు.


నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థులకు క్వాంటం కంప్యూటింగ్‌పై ప్రాక్టికల్ నైపుణ్యాలను అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.

Mannava-Mohana-Krishna-3.jpg


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ టెక్నాలజీ విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతికతలకు వేదికగా తీర్చిదిద్దుతున్నామని మోహన కృష్ణ పేర్కొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి క్వాంటం టెక్నాలజీ కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్లోబల్ క్వాంటం హ్యాకథాన్, స్టార్టప్ సమ్మిట్, క్వాంటం ఎక్స్‌పోతో పాటు IBM Qiskitపై హ్యాండ్స్-ఆన్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Mannava-Mohana-Krishna-8.jpg


క్వాంటం కంప్యూటింగ్ రంగంలో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మోహన కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ C.V. శ్రీధర్, క్వాంటమ్ మిషన్ అడ్వైజర్ వెంకట్ సుబ్రహ్మణ్యం, RGUKT వైస్ ఛాన్సలర్ M.L.N. రావు తదితరులు పాల్గొన్నారు.

Mannava-Mohana-Krishna-4.jpg

Mannava-Mohana-Krishna-6.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు

ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్

ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 05 , 2026 | 08:45 PM