Share News

బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:04 PM

బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.

 బీసీ విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం: మంత్రి సవిత
AP Minister Savitha

విజయవాడ, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత (AP Minister Savitha) వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. విజయవాడలోని గుణదల బీసీ బాలికల కళాశాల వసతి గృహంలో శానిటరీ కిట్లను మంత్రి సవిత ఈరోజు (బుధవారం) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లిఖార్జున, ఇతర బీసీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి మంత్రి సవిత మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థినుల వినతి మేరకు గుణదల హాస్టల్‌లో గ్రంథాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు.


ఒక్కో శానిటరీ కిట్‌లో 11 రకాల వస్తువులు..

బీసీ హాస్టళ్లలో 1,200 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామని మంత్రి సవిత వెల్లడించారు. ఏపీవ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లకు రూ.6 కోట్ల విలువైన శానిటరీ కిట్లు అందజేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఒక్కో కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయని వివరించారు. ఇప్పటికే బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో దోమ తెరలు ఏర్పాటు చేశామని అన్నారు. ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.


బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యా, వసతి అందిస్తున్నాం..

బీసీ విద్యార్థుల రక్షణకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. మెనూ సక్రమంగా అమలు చేసేలా 142 మంది కుక్‌లు, కమాటీలను నియమించామని తెలిపారు. ఇంటిని మైమరిపించేలా హాస్టళ్లు, గురుకులాల్లో వసతులను కల్పిస్తున్నామని చెప్పారు. వచ్చే పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో ఈ ఏడాది కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని అన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన విద్యా, వసతి అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్

సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్

ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 03:23 PM