రాష్ట్రపతి ముర్ము 14న కనకదుర్గమ్మ దర్శనానికి వస్తారు: మంత్రి ఆనం
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:42 PM
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14వ తేదీన సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వస్తున్నారని ఏపీ దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
విజయవాడ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14వ తేదీన సాయంత్రం విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వస్తారని ఏపీ దేవదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి (AP Minister Anam Ramnarayana Reddy) పేర్కొన్నారు.14, 15వ తేదీల్లో విజయవాడలో రాష్ట్రపతి ఉంటారని తెలిపారు. విజయవాడలో జరగనున్న దసరా వేడుకల ఏర్పాట్లను ఈరోజు (మంగళవారం) మంత్రి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. సరస్ ఉత్సవాల నేపథ్యంలో అనేక రాష్ట్రాల సీఎంలు వస్తారని.. వారికి అమ్మవారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.
దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడో సంవత్సరం దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం వెల్లడించారు. ప్రతీ ఒక్కరికీ దసరా దర్శనాలను సులభతరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. మంత్రుల బృందం ఏర్పాట్లను సమీక్షించిందని తెలిపారు. దాదాపు 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి వస్తారని అంచనా వేస్తున్నామని అన్నారు. దాదాపు రోజుకు 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. కొండచరియలు తొలగించి తాత్కాలికంగా ఈ ప్రాంతాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పుకొచ్చారు. రైల్వేస్ధలాన్ని మనకు హోల్డింగ్ ఏరియాగా ఇచ్చారని పేర్కొన్నారు.
దర్శనంలో ఎక్కడా ఇబ్బంది ఉండదు..
2.5 కిలోమీటర్ల క్యూలైన్ హోల్డింగ్ ఏరియా నుంచి వస్తుందని మంత్రి ఆనం వెల్లడించారు. వృద్ధులు, మహిళలు, పిల్లలకు పాలు, తాగునీరు, బిస్కెట్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. హోల్డింగ్ ఏరియాలో ప్రసాదం పంపిణీ ఉంటుందని అన్నారు. అన్నిమార్గాలను కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నామని చెప్పారు. 23వ తేదీ తర్వాత భవానీ మాలధారులు లక్షలాదిగా ఆలయానికి వస్తారని వివరించారు. సామాన్యుల నుంచి వీవీఐపీల వరకూ అందరికీ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్రపతి, సీఎంలు వచ్చినపుడు మాత్రమే కొంత సమయం సామాన్యుల దర్శనాన్ని నిలిపివేస్తామని చెప్పారు. అంతరాలయ దర్శనంలో ఎక్కడా ఇబ్బంది ఉండదని తెలిపారు. ఉదయం, సాయంత్రం 2 గంటల 45 నిముషాల పాటు వీఐపీ దర్శనాలు ఉంటాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News