Share News

వైభవంగా కనకదుర్గమ్మ మహా కుంభాభిషేకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

ABN , Publish Date - Mar 08 , 2026 | 01:36 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

వైభవంగా కనకదుర్గమ్మ మహా కుంభాభిషేకం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
AP Minister Anam Ramanarayana Reddy

విజయవాడ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. ఇంద్రకీలాద్రిపై పవిత్రమైన కార్యక్రమంలో తాను పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ మహా కుంభాభిషేకం ముగిసిందని తెలిపారు. ఈ నెల 6,7 తేదీల్లో అన్ని పూజలు నిర్వహించారని వివరించారు. నేడు పవిత్ర జలాలతో విమాన గోపురానికి అభిషేకం చేశారని ప్రస్తావించారు. కంచి పీఠాధిపతులు శంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందని తెలిపారు. సనాతన ధర్మ ప్రకారం అన్ని పూజాకార్యక్రమాలు జరిగాయని వెల్లడించారు. మంత్రాలయంలో ప్రత్యేకంగా రెండు గంటలపాటు మూల విరాట్‌కి పూజలు నిర్వహించారని తెలిపారు.


ఆ ఫొటోలు డిలీట్ చేయండి..

భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నేడు కేవలం అమ్మవారి ముఖ దర్శనం మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అమ్మవారి మహా కుంభాభిషేక కార్యక్రమానికి మొదటి రోజు నుంచి భక్తులు అధికంగా వస్తున్నారని తెలిపారు. పూజలు జరిగే సమయంలో అమ్మవారిని కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు తీశారని.. అది తప్పని.. మీ ఫోన్ నుంచి వేరే వారికి పంపించవద్దని.. ఈ ఫొటోలు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. కుంభాభిషేకం చేసే అదృష్టం అమ్మవారు తనకు కల్పించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్

విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 01:41 PM