Share News

ఏపీ లిక్కర్ స్కాం.. కారుమూరికి వైద్య పరీక్షలు పూర్తి

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:09 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఏపీ లిక్కర్ స్కాం.. కారుమూరికి వైద్య పరీక్షలు పూర్తి
Karumuri Venkata Nageswara Rao

హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం రవాణా కాంట్రాక్టుల్లో అక్రమాలకు సంబంధించి వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును (Karumuri Venkata Nageswara Rao) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో నిన్న (ఆదివారం) ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కారుమూరికి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఈరోజు (సోమవారం) వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అనంతరం కారుమూరిని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్‌‌ను అరెస్ట్‌ చేశారు.


నా అకౌంట్‌లో ఎలాంటి డబ్బులు జమ అవ్వలేదు: కారుమూరి

గాంధీ ఆసుపత్రి వద్ద మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. తన అకౌంట్‌లో ఎలాంటి డబ్బులు జమ అవ్వలేదని తెలిపారు. ఈ కేసులో తన కొడుకును అరెస్టు చేశారని, ఇప్పుడు తనను అరెస్టు చేశారని వెల్లడించారు. తన కుటుంబాన్ని మొత్తం అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తెలియదని చెప్పుకొచ్చారు.


తనకు ఏ కన్‌స్ట్రక్షన్ కంపెనీ నుంచి ఎలాంటి డబ్బులు చేరలేదని ఆయన అన్నారు. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ నుంచి తనకు డబ్బులు చేరాయన్నమాట అవాస్తవమని చెప్పారు. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌లో జరిగే వ్యవహారాలు తనకెలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ కేసులో నిజా నిజాలన్నీ కోర్టులో తేలుతాయని కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కొండా సురేఖపైన కుట్ర చేయాల్సిన ఎవరికి అవసరం లేదు: మంత్రి శ్రీహరి

గుడ్ న్యూస్.. నామినేటెడ్ పదవుల భర్తీపై మహేశ్ గౌడ్ కీలక ప్రకటన

'టాక్సిక్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ప్రమాదం.. మల్లారెడ్డి కాలేజీపై కేసు నమోదు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 24 , 2026 | 10:26 AM