Share News

పులివెందులలో హై టెన్షన్.. గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు

ABN , Publish Date - Oct 17 , 2026 | 02:25 PM

కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది.

పులివెందులలో హై టెన్షన్.. గాల్లోకి  6 రౌండ్ల కాల్పులు జరిపిన పోలీసులు
Pulivendula Election Tensions

కడప జిల్లా, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలోని పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్‌ కేంద్రం దగ్గర కూటమి, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలూ నామినేషన్ కేంద్రం దగ్గరకు దూసుకొచ్చాయి. రెండూ వర్గాలూ రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల పైకి దూసుకురావడంతో.. వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి 6 రౌండ్ల కాల్పులు జరిపారు. లాఠీచార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.


అలాగే, పోలీసులు టియర్‌ గ్యాస్‌‌ను ప్రయోగించారు. ఇరు పార్టీల శ్రేణులను నామినేషన్ కేంద్రం నుంచి దూరంగా పంపించి వేశారు. ఈక్రమంలో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి

ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 17 , 2026 | 03:07 PM