నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి జగన్ అండ్ కో కుట్ర చేస్తున్నారు.. భూమిరెడ్డి ధ్వజం
ABN , Publish Date - May 23 , 2026 | 11:24 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ , ఆయన సాక్షి మీడియా చేస్తున్న కుట్రలన్నీ విఫలమవుతోండటంతో ఇప్పుడు నిరుద్యోగులలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కడప, మే 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhoomireddy Ramagopal Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ , ఆయన సాక్షి మీడియా చేస్తున్న కుట్రలన్నీ విఫలమవుతోండటంతో ఇప్పుడు నిరుద్యోగులలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ నియామకాలు వందకు వందశాతం పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. ఇప్పుడు అక్రమాలంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తే ఎవరు నమ్మరని చెప్పుకొచ్చారు. ఈరోజు (శనివారం) కడప వేదికగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
దొంగే, దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్ పరిస్థితి..
జగన్ హయాంలో గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీ ఏ విధంగా చేశారో, ఉద్యోగాలు పొందిన వారు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి తెచ్చిన వారు ఎవరో ప్రజలకు తెలుసునని అన్నారు. ఇప్పుడు డీఎస్సీ గురించి జగన్ అండ్ కో మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దొంగే, దొంగ దొంగ అని అరిచినట్లుగా జగన్ పరిస్థితి ఉందని సెటైర్లు గుప్పించారు. క్రీడాకారుల కోటా ఉద్యోగాలను వందశాతం పారదర్శకంగా ఇచ్చామని స్పష్టం చేశారు. జగన్ అండ్ కో తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించమని హెచ్చరించారు. రూపాయి అవినీతి లేకుండా తాము ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కులాల మధ్య, మతాల మధ్య పెట్టాలనుకున్న చిచ్చు విఫలం కావడంతో ఇప్పుడు నిరుద్యో గులను టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ అండ్ కో చేసే కుట్రల్లో ఎవరూ పావులు కావద్దని సూచించారు. కోర్టు కేసులనేవి ఏ ప్రక్రియలో అయినా ఉంటాయని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News