రావణ్, ప్రకాశ్ రాజ్‌లకు వైసీపీ మద్దతు.. దేశం మీద దాడి చేయడమే: విజయసాయి రెడ్డి
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:32 PM
జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఎవరిస్తున్నారు? అని ప్రశ్నించారు.
అమరావతి, జులై 8 (ఆంధ్రజ్యోతి): జోసెఫ్ రావణ్ వ్యవహారంపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఎవరిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. వారిద్దరు ఏ సంస్కృతికి వారసులు? అని నిలదీశారు. వారి తండ్రులు, తాతలు ఎవరు? మూలాలు ఎక్కడ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. తప్పుగా మాట్లాడినవారికి చట్టం, సమాజం బుద్ధి చెప్పాలని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.
అలాంటివారికి యావజ్జీవం లేదా ఉరిశిక్ష వేసినా తప్పులేదని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అభ్యంతర వ్యాఖ్యలతో దాడి చేయడం ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు. మతం మారిన కొన్ని కులాల్లోని కుటుంబాలు.. హిందుత్వంపై విషం చిమ్ముతున్నాయని ధ్వజమెత్తారు. జోసెఫ్ రావణ్, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ను వైసీపీ సమర్థించడమంటే.. దేశంపై చేస్తున్న దాడిగానే పరిగణించాలని అన్నారు. దేశద్రోహ కుట్రలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని విజయసాయి రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News