Share News

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ABN , Publish Date - Oct 04 , 2026 | 06:23 PM

తెనాలి ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ వ్యాఖ్యానించారు. ప్రకృతి సాగును సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు.

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు
Union Minister Shivraj Singh Chouhan

తెనాలి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ (Union Minister Shivraj Singh Chouhan) వ్యాఖ్యానించారు. ప్రకృతి సాగును సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారంటూ కితాబు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని ఉద్ఘాటించారు. ఈరోజు (ఆదివారం) గుంటూరు జిల్లాలో ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెనాలిలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు పర్యటించారు. బుర్రిపాలెంలో జానకీరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న రైతు జానకీ రామ్‌ను భుజం తట్టి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అభినందించారు. జానకీరామ్ అవలంభిస్తున్న సాగు పద్ధతులు, ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడారు.


ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు..

50 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని శివరాజ్ సింగ్ చౌహన్ వెల్లడించారు. ఎలాంటి ఎరువులు, కెమికల్స్ వాడకుండా ప్రకృతి సాగు చేయడం చాలా ఆనందాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. బీజామృతం, జీవామృతాలతో సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రోత్సహిస్తున్నారని వివరించారు. ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందని వెల్లడించారు. ప్రకృతిసాగుతో ప్రజారోగ్యం బాగుంటుంది.. భూసారం పెరుగుతుందని చెప్పుకొచ్చారు. భూసారం బాగుంటే చక్కటి పంట వస్తుందని... చక్కటి పంట వస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని శివరాజ్ సింగ్ చౌహన్ పేర్కొన్నారు.


ఎకరా వరి సాగుకు రూ.7 వేలు మాత్రమే ఖర్చు: రైతు జానకీ రామ్

నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో ఎకరా వరి సాగుకు రూ.7 వేలు మాత్రమే ఖర్చు అవుతోందని రైతు జానకీ రామ్ చెప్పారు. అదే రసాయన ఎరువులతో సాగు చేస్తే ఎకరాకు రూ. 25 వేలు ఖర్చు అవుతుందని వెల్లడించారు. పెద్దఎత్తున సాగు ఖర్చులు తగ్గుతున్నాయని... దీని వల్ల రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు. ప్రకృతి సాగుతో పండించిన ఉత్పత్తికి మార్కెట్లో కూడా చక్కటి ధర లభిస్తోందని జానకీ రామ్ అన్నారు. అంతకుముందు బుర్రిపాలెంలో సినీనటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ నివాళులర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 06:51 PM