Share News

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్

ABN , Publish Date - Mar 24 , 2026 | 03:46 PM

అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్
Kinjarapu Rammohan Naidu

అనకాపల్లి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తలరాతను మార్చనున్న మెగా స్టీల్ ప్లాంట్‌ ప్రాజెక్ట్ ఇదని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌గా ఏపీ ప్రాజెక్ట్ రికార్డు సృష్టించనుందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


లక్షలాదిమందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించనుందని రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. ఏటా 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగనుందని వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక మైలురాయని ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కృషితో ఈ భారీ ప్రాజెక్ట్ సాకారమైందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఆర్సెలార్ మిట్టల్ - నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ ఇంజిన్‌గా మారనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు

అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 03:50 PM