ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - May 20 , 2026 | 04:22 PM
ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఏపీ ఎన్ఆర్టీ భవన్‌లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది.
అమరావతి, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రవాసాంధ్రుల సంక్షేమం, సమస్యల పరిష్కరానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) తెలిపారు. ఈరోజు (బుధవారం) ఏపీ ఎన్ఆర్టీ భవన్‌లో మంత్రి కొండపల్లితో తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై సలహా కమిటీ సమావేశమైంది. ఏపీలో అమలవుతున్న ఉత్తమ ఎన్నారై పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాల అధ్యయనం కోసం ఏపీలో తెలంగాణ కమిటీ పర్యటిస్తోంది. గల్ఫ్ వలసదారులు, విదేశీ కార్మికుల సంక్షేమంపై ఏపీలో అమలవుతున్న పద్ధతులపై తెలంగాణ కమిటీ అధ్యయనం చేస్తోంది.
క్షేత్రస్థాయిలో ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సేవలు, అత్యవసర సహాయక చర్యలను తెలంగాణ బృందం పరిశీలించింది. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, నకిలీ ఏజెంట్లపై ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ తీసుకుంటున్న చట్టపరమైన చర్యలపై చర్చించారు. గల్ఫ్ వలసదారుల భద్రత, బీమా సౌకర్యాలు, స్వదేశానికి తిరిగి వచ్చిన వారి కోసం అమలు చేస్తున్న పునరావాస పథకాలపై అధికారులను అడిగి తెలంగాణ సభ్యులు తెలుసుకున్నారు. ఏపీఎన్ఆర్టీ విధానాలపై అక్కడి ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నారై సలహా కమిటీ సభ్యులు ఓ నివేదిక ఇవ్వనున్నారు. మంత్రి కొండపల్లితో జరిపిన చర్చల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ బీఎం. వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జాలర్ల కుటుంబంతో ఆత్మీయంగా గడిపిన సీఎం చంద్రబాబు
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ధ్వజం
స్విచ్‌లు నొక్కితే సీఎం కాలేరు.. జగన్‌పై షర్మిల సెటైర్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News