Share News

స్థానిక ఎన్నికలు.. జగన్‌‌కు ఎంపీ చింతకాయల విజయ్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Nov 03 , 2026 | 09:02 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అభినందనలు చెప్పాల్సింది పులివెందుల ప్రజలకు అని తెలిపారు.

స్థానిక ఎన్నికలు.. జగన్‌‌కు  ఎంపీ చింతకాయల విజయ్ స్ట్రాంగ్ కౌంటర్
TDP MP Chintakayala Vijay

అమరావతి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డికి తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ ( TDP MP Chintakayala Vijay) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అభినందనలు చెప్పాల్సింది పులివెందుల ప్రజలకు అని తెలిపారు. ఈరోజు (మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో విజయ్ మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రజాస్వామ్య పద్ధతిలో పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఈ ఎన్నికల్లో ఓట్లు వేశారని చెప్పుకొచ్చారు.


జగన్ తీరు బాధకరం..

బెంగళూరులో ఉంటూ రాష్ట్రంలోని పరిస్థితులపై జగన్ రెడ్డి ట్వీట్ చేశారని విజయ్ అన్నారు. ఇక్కడ సొంత పార్టీ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు జగన్ ప్రకటించిన వైసీపీ నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి స్వయంగా పోలీసులు, ఎన్నికల అధికారుల పనితీరును మెచ్చుకున్నారని ప్రస్తావించారు. వంకర టింకర బుద్ధికి అన్నీ వంకరగానే కనిపిస్తాయనే మాదిరిగా జగన్ తీరు ఇవాళ ఉండటం బాధకరమని చింతకాయల విజయ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. 29 రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే నియంత్రణ

తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 03 , 2026 | 09:21 PM