వైసీపీ హయాంలో విధ్వంసమే అజెండాగా పాలన సాగించారు: ధూళిపాళ్ల
ABN , Publish Date - Apr 08 , 2026 | 01:57 PM
వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు.
గుంటూరు జిల్లా, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (MLA Narendra Kumar) ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు. రైతులు లేకున్న వారి పేరుతో ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ వార్తలు ప్రచారం చేసి లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు(బుధవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడారు.
నేరస్థులకు వైసీపీ మద్దతు పలుకుతోంది..
ఎక్కడ ఏ గొడవ జరిగినా తమ ప్రభుత్వానికి అంటగడుతున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. పొన్నూరు నియోజకవర్గంలో వంశీ, గోపీ అనే నేరస్థులకు వైసీపీ మద్దతు పలుకుతోందని ఫైర్ అయ్యారు. వైసీపీ ఐదేళ్ల హయాంలో కూడా వీరిపై కేసులు నమోదయ్యాయని ప్రస్తావించారు. మద్యం దుకాణం వద్ద నలుగురు వైసీపీ కార్యకర్తలతో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి మధ్య గొడవ జరిగిందని తెలిపారు. దుర్గా ప్రసాద్‌తో వ్యక్తిగత గొడవని రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. కులాల ప్రస్తావన లేకుండానే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారని అన్నారు.
మాకు దాడి చేయాలంటే ఒక్క రోజు పట్టదు..
వైసీపీ అస్తిత్వం కోల్పోతున్న తరుణంలో ఏదో ఒక గందరగోళం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. తాము దాడి చేయాలని అనుకుంటే ఒక్క రోజు పట్టదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరుల దోపిడీ, ప్రజలను దోపిడీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు అధికారం పోగానే ప్రజల మధ్య గొడవలు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. మహిళలను వేధించే వారిని వెనకేసుకు వస్తున్నారని ఫైర్ అయ్యారు. రప్ప రప్ప అనే వారికి జగన్ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు.
దాడులు చేసే సంస్కృతికి తావు లేదు..
ప్రజాస్వామ్యంలో దాడులు చేసే సంస్కృతికి తావు లేదని.. కానీ వైసీపీ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా దాడులు, హింసను ప్రోత్సహిస్తోందని ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టాలు తమ పని తాము చేసుకుంటూ వెళ్తాయని అన్నారు. సాక్షి దినపత్రికలో తమపై ఎన్నో వార్తలు రాశారని.. దాడులతో సమాధానం చెప్పాలంటే సాక్షిపై ఎన్ని దాడులు జరగాలని చెప్పుకొచ్చారు. అసత్యాలు రాశారు, తమ కుటుంబ సభ్యులపైనా రాశారని.. చివరకు న్యాయమూర్తులపైన కూడా తప్పుడు రాతలు రాశారని ధ్వజమెత్తారు. వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నారు గాని.. దాడులు చేయలేదని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై దాడులు తగవు.. వైసీపీపై పవన్ కల్యాణ్ ధ్వజం
నిజాలు మాట్లాడితే భౌతిక దాడులా.. వైసీపీపై రామ్మోహన్ ధ్వజం
ఉన్నత విద్యపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News