సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం.. పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Aug 26 , 2026 | 09:06 AM
సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాలోని కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడం బాధాకరమని తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలను అధికారుల ద్వారా పవన్ తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర అధికారులతో ఏపీ యంత్రాంగం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి: మంత్రి లోకేశ్

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి మండిపల్లి

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందడంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలు, డ్రైవర్ల అప్రమత్తత విషయంలో రాజీ పడకూడదని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించేలా అధికారులు మరింత కఠినంగా పర్యవేక్షించాలని అన్నారు. ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యంగా అన్ని బస్సుల యాజమాన్యం, డ్రైవర్లు వ్యవహరించాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
బస్సు ప్రమాదంపై ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం..
ఈ బస్సు ప్రమాదంపై ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. డీసీఎం కంటైనర్‌ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొనడంతో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తుండగా ఈ బస్సు ప్రమాదానికి గురైంది. సూర్యాపేట పోలీసులతో ఏలూరు పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News