Share News

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై చర్చ

ABN , Publish Date - May 11 , 2026 | 05:22 PM

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. ఏపీ ప్రాజెక్టులపై చర్చ

ఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు(సోమవారం) ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి సమన్వయం చేస్తూ కాజా టోల్‌గేట్ సమీపాన నిర్మించిన వెస్ట్ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని కేంద్రమంత్రి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.


విజయవాడ వెస్ట్ బైపాస్ NH - 16తో కలిసే చిన్నకాకాని జంక్షన్ వద్ద ప్రస్తుతం గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌చేంజ్ లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని పెమ్మసాని వివరించారు. విజయవాడ వైపు వెళ్లే వాహనాలు హైల్యాండ్ ఫ్లైఓవర్ కింద ఉన్న రెండు లైన్ల సర్వీస్ రోడ్, యూటర్న్ ద్వారా వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడం, లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.


అశ్విని వైష్ణవ్‌తో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ..

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పల్నాడు అభివృద్ధికి సంబంధించి కీలక రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడారు. పిడుగురాళ్ల - సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వేలైన్ నిర్మించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీతో పల్నాడులో పారిశ్రామిక, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (సికింద్రాబాద్ - తిరుపతి) నిలపాలని విజ్ఞపి చేశారు.


లింగంపల్లి - విజయవాడ ఎక్స్‌ప్రెస్ (12796) హాల్టింగ్ కోసం కేంద్రమంత్రికి ఎంపీ వినతిపత్రం అందజేశారు. విజయవాడ - బెంగళూరు మధ్య కొత్తగా వందేభారత్ రైలును ప్రారంభించాలని కోరారు. విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారుల సౌకర్యార్థం హైస్పీడ్ కనెక్టివిటీ అవసరమని తెలిపారు. ఎంపీ లావు ప్రతిపాదనలపై సానుకూలంగా రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. పల్నాడు ప్రాంత రైల్వే సమస్యల పరిష్కారానికి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 11 , 2026 | 05:26 PM