Share News

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:53 PM

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలి: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, జులై 16 (ఆంధ్రజ్యోతి): పూరీ జగన్నాథుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. పవిత్రమైన జగన్నాథ రథయాత్ర సందర్భంగా.. జగన్నాథస్వామి, బలభద్రస్వామి, సుభద్రాదేవిలకు భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. రథయాత్ర అనేది విశ్వాసం, భక్తి, దేవునికి, భక్తులకు మధ్య ఉన్న శాశ్వత అనుబంధానికి సంబంధించిన ఓ దివ్యమైన వేడుక అని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పోస్టు పెట్టారు. పవిత్ర రథాలు ముందుకు సాగుతుండగా, జగన్నాథస్వామి ఆశీస్సులు ప్రతి హృదయానికి శాంతిని, ప్రతి కుటుంబానికి బలాన్ని, ప్రతి జీవితానికి ఆశను ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.


ఆ స్వామి మనల్ని ధర్మమార్గంలో నడిపించి, మన ఇళ్లను సుఖసంతోషాలు, ఐశ్వర్యాలతో నింపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అలాగే వినమ్రత, భక్తితో సమాజానికి సేవ చేసే జ్ఞానాన్ని, ధైర్యాన్ని మనకు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ శుభదినాన, జగన్నాథస్వామి దివ్య అనుగ్రహం మన జీవితాల్లో వెలుగులు నింపి, శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక బలంతో కూడిన భవిష్యత్తు వైపు మనల్ని నడిపించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం

తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 16 , 2026 | 01:44 PM