Share News

’క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.. జగన్ అండ్ కో పై పల్లా శ్రీనివాసరావు ధ్వజం

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:25 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు.

’క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు.. జగన్ అండ్ కో పై పల్లా శ్రీనివాసరావు ధ్వజం
Palla Srinivasa Rao

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై వైసీపీ బురదజల్లుతోందని ధ్వజమెత్తారు. సీబీఐ అధికారుల నివేదికలు ఉన్నా ‘క్లీన్ చిట్’ నాటకం ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిన అంశంపై సమాధానం చెప్పకుండా దారి మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి వేదికగా ఇవాళ(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు పల్లా శ్రీనివాసరావు.


హెరిటేజ్‌పై వైసీపీవి నిరాధార ఆరోపణలు..

మత భావోద్వేగాలను రెచ్చగొట్టి, అవినీతిని కప్పిపుచ్చుకోవాలని జగన్ ముఠా చేసిన ప్రయత్నం బహిర్గతమైందని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. హెరిటేజ్‌పై వైసీపీ నేతలు చేసిన నిరాధార ఆరోపణలకు ఒక్క ఆధారమూ చూపలేకపోయిన వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని అన్నారు. ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుని కంటెంట్ తొలగించాలని ఆదేశించిందంటే.. వారివి అబద్దాలని కోర్టు తేల్చి చెప్పినట్లే కదా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తి నిజాలు బయటపడతాయని, బాధ్యులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 05:44 PM