Share News

ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:14 PM

గద్దర్ అవార్డులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎంపిక కావడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్ పురస్కారానికి చిరంజీవి ఎంపిక.. పల్లా శ్రీనివాసరావు అభినందనలు
Palla Srinivasa Rao

అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): గద్దర్ అవార్డులపై తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నందమూరి తారక రామారావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ పురస్కారానికి ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఎంపిక కావడం ఆనందదాయకమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చిరంజీవికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా రంగానికి చిరంజీవి చేసిన సేవలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


ఎన్నో దశాబ్దాలుగా తన నటనతో, సేవా కార్యక్రమాలతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన చిరంజీవి ఈ పురస్కారానికి ఎంపిక కావడం గర్వకారణమని పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. అదేవిధంగా వివిధ సినీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు కూడా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా రంగానికి విశేష సేవలు అందించిన నటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్, ప్రజా సమస్యలపై సినిమాలు రూపొందించిన దర్శకుడు, నటుడు ఆర్. నారాయణమూర్తి, నిర్మాత రమేశ్ ప్రసాద్, ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సీనియర్ నటి జయసుధలకు కూడా పల్లా శ్రీనివాసరావు అభినందనలు తెలిపారు.


భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి వీరు అందించిన సేవలు చిరస్మరణీయమైనవని పేర్కొన్నారు. తెలుగు సినీ రంగం మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సినిమా అభివృద్ధిలో ఈ మహనీయుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పురస్కారాలు మరింత మంది ప్రతిభావంతులైన కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయని పల్లా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్

గద్దర్ అవార్డుల ప్రకటన.. చిరంజీవికి ‘ఎన్టీఆర్ నేషనల్’ అవార్డ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 08 , 2026 | 12:20 PM