Minister Narayana: జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదు.. మంత్రి నారాయణ ఫైర్
ABN , Publish Date - Jan 02 , 2026 | 06:23 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
అమరావతి ,జనవరి2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ (Minister Narayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఇవాళ(శుక్రవారం) నేలపాడులో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధాని 29 గ్రామాల్లో మౌలిక సదుపాయలను రూపకల్పన చేయనుంది సీఆర్డీఏ. ఈ క్రమంలో నేలపాడు, మల్కాపురం గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేశారు. నేలపాడు గ్రామంలో మౌలిక సదుపాయాలపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి నారాయణ.
రాజధాని పనులు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రూ.48 వేల కోట్లకు 2019లో టెండర్లు పిలిచామని చెప్పుకొచ్చారు. రూ.9 వేల కోట్ల విలువైన పనులు జరిగాయని వెల్లడించారు. గత ప్రభుత్వం రూ.3000కోట్ల చెల్లింపులను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. గత ప్రభుత్వం వారి కాంట్రాక్టులు కూడా రద్దు చేయలేదని ప్రస్తావించారు. మళ్లీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ టెండర్లు పిలిచామని గుర్తుచేశారు. అమరావతిలో వర్షాలతో రెండు నెలలు పనులు జరుగలేదని చెప్పుకొచ్చారు మంత్రి నారాయణ.
పనులు జరుగుతున్న ప్రాంతాల లెవెళ్ల ఆధారంగా గ్రామాల రోడ్లు లెవెల్ చేస్తామని వివరించారు. అమరావతిలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2058కి జనాభా ఎంత పెరుగుతోందనే అంచనాతో వర్షపు నీరు, డ్రైన్లు, తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కాంట్రాక్టర్‌ల సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం పట్టిందని చెప్పుకొచ్చారు. రెండు నెలల తర్వాత మళ్లీ ఈ గ్రామాలకు వస్తానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
Read Latest AP News And Telugu News