డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Aug 22 , 2026 | 07:53 PM
డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఐదోసారి సవాల్ విసిరారు. టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. చర్చకు నేను సిద్ధమని ఛాలెంజ్ చేశారు.
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఐదోసారి సవాల్ విసిరారు. ‘టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. చర్చకు నేను సిద్ధం’ అని ఛాలెంజ్ చేశారు. ఈరోజు (శనివారం) విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై తెలుగుదేశం పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు.
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక..
టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని లోకేశ్ వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించాలని టీడీపీ కేడర్‌కు మంత్రి లోకేశ్ మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News