మంత్రి లోకేశ్ సమక్ష్యంలో మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:12 PM
మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున పలు పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్ష్యంలో చేరారు. కొలనుకొండ సీపీఎం సీనియర్ నేత కాట్రగడ్డ శివన్నారాయణ, ఆత్మకూరుకు చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నేత ముసలి జ్యోతిబసు, పేరుకలపూడికి చెందిన వైసీపీ సీనియర్ నేత నూతలపాటి చెన్నకేశవరావు టీడీపీలో జాయిన్ అయ్యారు.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో పెద్దఎత్తున పలు పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్ష్యంలో చేరారు. కొలనుకొండ సీపీఎం సీనియర్ నేత కాట్రగడ్డ శివన్నారాయణ, ఆత్మకూరుకు చెందిన సీపీఎం పార్టీ సీనియర్ నేత ముసలి జ్యోతిబసు, పేరుకలపూడికి చెందిన వైసీపీ సీనియర్ నేత నూతలపాటి చెన్నకేశవరావు టీడీపీలో జాయిన్ అయ్యారు.
ఈమని గ్రామానికి చెందిన వైసీపీ నేత ఉయ్యూరు వెంకటేశ్వరరావు, ఈమనికి చెందిన వైసీపీ నేత ముద్రబోయిన శ్రీను, చిలువూరుకు చెందిన వైసీపీ నేత షేక్ యూసబ్ టీడీపీలో చేరారు. వీరితో పాటు సుమారు 200 కుటుంబాలు టీడీపీలో జాయిన్ అయ్యాయి. అందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఏపీ మంత్రి నారా లోకేశ్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News