మాజీ మంత్రి అంబటి రాంబాబుకు షాక్.. పోలీసుల నోటీసులు
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:56 PM
మాజీమంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు కిర్లంపూడి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
గుంటూరు జిల్లా, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కిర్లంపూడి పోలీసులు ఈరోజు (సోమవారం) నోటీసులు ఇచ్చారు. ఈ ఏడాది జులై 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అంబటి అడ్డుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులను అడ్డుకుని నెట్టివేశారు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు రావాలని ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై అంబటి రాంబాబుపై అప్పట్లోనే కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 8వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఆ రోజున తనకు వేరే కార్యక్రమాలు ఉన్నాయని.. ఏ తేదీన విచారణకు వచ్చేది త్వరలోనే చెబుతానని అంబటి రాంబాబు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News