Home » Mudragada Padmanabham
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి మృతిపై బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకు ముద్రగడ చేసిన సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన చేసిన కృషిని బీఆర్ఎస్ అగ్రనేతలు కొనియాడారు.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.
వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి(73) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్సపొందుతూ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
Mudragada: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తమ కుటుంబంపై ఓ కుటుంబం దాడి చేస్తోందంటూ ఆయన తన కుమార్తె క్రాంతిని ఉద్దేశించి విమర్శలు చేశారు. మనస్పర్దలతో ఆ కుటుంబం జోలికి వెళ్లకపోయినా టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారం జరగనున్న నేపథ్యంలో కౌన్సిలర్లను ఎన్నికకు రాకుండా చేసేందుకు వైఎస్పార్‌సీపీ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్లాన్ చేశారు. మరోవైపు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఎన్నికకు హాజరవుతారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Sana Satish: ముద్రగడ పద్మనాభరెడ్డి, వైసీపీపై తెలుగుదేశం ఎంపీ సానా సతీష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముద్రగడ ఇంటిపై జరిగిన దాడి డ్రామానే అని ఆరోపించారు. ఈ దాడి వైసీపీ చేయించినట్లుగా ఉందని సానా సతీష్ అనుమానం వ్యక్తం చేశారు.
కాకినాడ జిల్లా కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం ముందు ఓ యువకుడు మద్యం సేవించి హల్ చల్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు.
Mudragada Padmanabha Reddy: వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి అన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది తెలుసుకొని లోకేష్‌కు మంచి సలహాలు ఇవ్వాలని కోరారు.
సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆ లేఖపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనదైన శైలిలో స్పందించారు. ఆ క్రమంలో ముద్రగడకు బుద్దా బహిరంగ లేఖ రాశారు.
ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మారినా.. ముద్రగడ ముద్రగడేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు సష్టం చేశారు. బుధవారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి అంబటి రాంబాబు భేటీ అయ్యారు.