Share News

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కన్నుమూత..

ABN , Publish Date - Jul 14 , 2026 | 07:20 PM

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి(73) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్సపొందుతూ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.

వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కన్నుమూత..
Mudragada Padmanabha Reddy

కాకినాడ: వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి(73) మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో చికిత్సపొందుతూ ఈరోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కిడ్నీ సమస్యలతో గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన చేరారు. అప్పటి నుంచి అక్కడ ముద్రగడకి చికిత్స జరుగుతోంది. అయితే, ఇవాళ సాయంత్రం పరిస్థితి విషమించడంతో ముద్రగడ పద్మనాభరెడ్డి ప్రాణాలు కోల్పోయారు.


కాగా, ముద్రగడ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి. 1953 జనవరి 22న ఆయన జన్మించారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తన జీవిత కాలంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా, ఒకసారి ఎంపీగానూ ఆయన పని చేశారు. ముఖ్యంగా కాపు ఉద్యమ నేతగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. ముద్రగడ మృతితో పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమలాపురంలో రైతుల ఆందోళన.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన

Updated Date - Jul 14 , 2026 | 07:32 PM