నీటి లభ్యతకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి.. రైతులకు మంత్రి తుమ్మల సూచన
ABN , Publish Date - Jul 14 , 2026 | 05:39 PM
ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలోని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. తెలంగాణలో 30 నుంచి 35 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించిందని తెలిపారు.
హైదరాబాద్, జులై 14: ఎల్‌నినో ప్రభావంపై తెలంగాణలోని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచనలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో రైతు నేస్తం కార్యక్రమంలో రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. తెలంగాణలో 30 నుంచి 35 శాతం తక్కువ వర్షపాతం నమోదయిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించిందని తెలిపారు. వచ్చే మూడు నెలలూ వర్షాభావ పరిస్థితులే ఉండవచ్చని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల లభ్యత కూడా తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులకు ఆయన సూచించారు.
వరి, చెరకు వంటి అధిక నీటి పంటలకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వారికి వివరించారు. జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు మంత్రి తుమ్మల వివరించారు. తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే వంగడాలు ఎంచుకోవాలని రైతులకు స్పష్టం చేశారు. వ్యవసాయ, నీటి పారుదల, భూగర్భ జలాలు - భారత వాతావరణ విభాగం సమన్వయంతో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తామని చెప్పారు.
జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని నిరంతరం పరిశీలించాలని ఈ సందర్భంగా అధికారులను మంత్రి ఆదేశించారు. చిరు ధాన్యాల సాగు పెంచాలని హైదరాబాద్‌లోని ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) సూచించిందని గుర్తు చేశారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులతో వర్షాభావాన్ని ఎదుర్కోవాలని నిపుణులు సూచనలు చేశారని పేర్కొన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలని రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంలో ముగిసిన సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు: ఏసీబీ
జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
For More TG News And Telugu News