Share News

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంలో ముగిసిన సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు: ఏసీబీ

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:07 PM

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు.

హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసంలో ముగిసిన సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు: ఏసీబీ
TG ACB

హైదరాబాద్, జులై 14: హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో సోదాలు ముగిశాయని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు. ఈ సోదాల్లో అతని వద్ద ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలిపారు. సోదాల అనంతరం ఆయన మాట్లాడారు. సుమధుర అక్రోపోలిస్‌లో 3BHK ఫ్లాట్, శ్రీవారి మెడోస్‌లో మరో ప్లాట్ ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వాసవి అట్లాంటిస్‌లో ఏకంగా మూడు ప్లాట్లు కొనుగోలు చేసినట్లు కనుగొన్నామని చెప్పారు. మసీద్‌ బండలో నాలుగు అంతస్తుల భారీ భవనం, జడ్చర్లలో 7 ప్లాట్లు, కొండాపూర్‌లో రెండు ప్లాట్లు ఉన్నాయని వివరించారు.


శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తమకు ఆధారాలు లభ్యమయ్యాయని పేర్కొన్నారు. సోదాల్లో అర కిలో బంగారం, వెండి వస్తువులతో పాటు రూ.10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సీజ్ చేశామని అన్నారు. అలాగే బచ్చు రవీందర్ పేరిట ఉన్న 4 బ్యాంక్ లాకర్లను గుర్తించి.. వాటిని ఫ్రీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆస్తులతో పాటు ఇంట్లో నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన 18 విదేశీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ వెల్లడించారు.


రవీంద్రపై ఏసీబీ కేసు నమోదు

  • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బి. రవీందర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రవీందర్ నివాసంలో సోదాలపై ప్రెస్ నోట్‌ను విడుదల చేసింది.

  • కొండకల్‌లో 2 ఓపెన్ ఫ్లాట్స్, కిష్టాపూర్ 2 ఓపెన్ ఫ్లాట్స్, పసుమాములలో 1 ఓపెన్ ప్లాట్, నార్సింగిలో 3 ఫ్లాట్లు, నానక్‌రామ్‌గూడలో 1 ఫ్లాట్ గుర్తింపు.

  • గూడూరు గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తింపు.

  • మోకిలాలో విల్లా, కొండాపూర్‌లో జీ+4 భవనం గుర్తింపు.

  • రూ.9.24 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు.

  • బహిరంగ మార్కెట్లో వీటి విలువ వందల కోట్ల రూపాయిలపైనే ఉంటుందని అంచనా.


  • రవీందర్ నివాసంలో రూ.3.82 లక్షల నగదు స్వాధీనం.

  • బ్యాంకు ఖాతాల్లో రూ.45.05 లక్షల బ్యాలెన్స్ గుర్తించిన అధికారులు.

  • ఖరీదైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గృహోపకరణాలు,1.44 కిలోల బంగారం,12.5 కిలోల వెండి ఆభరణాలు సీజ్.

  • ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ సహా 4 వాహనాలు గుర్తింపు.

  • స్వాధీనం చేసిన వాహనాల విలువ సుమారు రూ.1.16 కోట్లు.

  • మొత్తం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.9.24 కోట్లు.

  • రూ.17.24 లక్షల విలువైన గృహోపకరణాలు గుర్తింపు.

  • రూ.9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు స్వాధీనం.

  • 7 శాంసంగ్ మొబైల్స్, 2 స్మార్ట్‌వాచ్‌లు, ఐప్యాడ్, ట్యాబ్లెట్లు, హార్డ్‌డిస్క్‌లు గుర్తింపు.

  • ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, మహీంద్రా ఎక్స్‌యూవీ సహా 4 వాహనాలు గుర్తింపు.

  • సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని స్పష్టం చేసిన ఏసీబీ.

  • మరికొద్ది సేపట్లో రవీందర్‌ను అరెస్టు చేసి వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్న అధికారులు


ఈ వార్తలు కూడా చదవండి..

రక్తం ప్యాకెట్లతో రాజకీయం అవసరం లేదు.. బీఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్

ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీబిజీ.. కేంద్రమంత్రులు గడ్కరీ, రామ్మోహన్‌తో కీలక భేటీలు

For More TG News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 10:12 PM