Share News

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్

ABN , Publish Date - Aug 06 , 2026 | 09:03 PM

ఆయుశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. ఆయుశ్‌ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు.

ఆయుశ్‌కు కేంద్రం భారీ ప్రాధాన్యం: మంత్రి సత్యకుమార్
AP Health Minister Satya Kumar Yadav

విజయవాడ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆయుశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ (AP Health Minister Satya Kumar Yadav) వ్యాఖ్యానించారు. ఆయుశ్‌ బడ్జెట్ రూ.1,070 కోట్ల నుంచి రూ.3,500 కోట్లకు పెంచినట్లు పేర్కొన్నారు. ప్రాచీన వైద్య విధానాలకు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందని వెల్లడించారు. ఈరోజు (గురువారం) విజయవాడలో మంత్రి సత్యకుమార్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాధి నివారణే ఆయుశ్‌ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. మునగ, అశ్వగంధ, ఉసిరికి ప్రపంచ మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉందని వివరించారు.


ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి..

ప్రివెంటివ్ హెల్త్‌కేర్‌పై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ఏపీలో ఆయుశ్‌ అభివృద్ధికి కేంద్రం నిధులను పెంచిందని చెప్పుకొచ్చారు. NAM కింద ఏపీకి మూడేళ్లలో రూ.426 కోట్ల నిధులు విడుదల అయ్యాయని వెల్లడించారు. విజయవాడ, కాకినాడ, కడప ఆయుశ్‌ ఆస్పత్రుల ఆధునికీకరణ చేస్తున్నట్లు తెలిపారు. 150 ఆయుశ్‌ డిస్పెన్సరీల అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 126 కేంద్రాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లుగా మార్చినట్లు వెల్లడించారు. 90 ఆయుశ్‌ కేంద్రాలను NABH గుర్తించిందని తెలిపారు. ప్రజలకు సహజసిద్ధ నివారణా వైద్యం అందించడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 09:25 PM