Share News

ఏపీకి రూ.4,851 కోట్ల విద్యుత్ ప్రాజెక్ట్.. 90 శాతం నిధుల కోసం కేంద్రానికి మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:59 PM

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఢిల్లీలో శుక్రవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.

 ఏపీకి రూ.4,851 కోట్ల విద్యుత్ ప్రాజెక్ట్.. 90 శాతం నిధుల కోసం కేంద్రానికి మంత్రి గొట్టిపాటి విజ్ఞప్తి
AP Minister Gottipati Ravi Kumar

ఢిల్లీ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (AP Minister Gottipati Ravi Kumar) ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇటీవల తుపానుల ధాటికి రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న విధానాన్ని కేంద్రమంత్రికి వివరించారు. తీర ప్రాంతాల్లో తుపానులను ఎదుర్కొనేలా విద్యుత్ వ్యవస్థల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సాయం కోరారు. తీర ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, స్పన్‌పోల్స్‌తో విద్యుత్ లైన్ల పునర్నిర్మాణానికి సాయం కోరారు.


తుపాను నిరోధక విద్యుత్ వ్యవస్థకు రూ.4,851 కోట్లు మేర ఖర్చు అవుతుందని ఖట్టర్‌కు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ఇందులో 90 మేర శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం భరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తే మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామని తెలిపారు. తుపాను నిరోధక విద్యుత్ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని వెల్లడించారు. తక్కువ ఆస్తి నష్టంతో, విద్యుత్ అంతరాయాలు లేకుండా, త్వరితగతిన పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చని వివరణ ఇచ్చారు. మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లేఖకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 10:50 PM