Share News

వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

ABN , Publish Date - Sep 21 , 2026 | 05:17 PM

వైసీపీకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు రాజీనామా చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుబ్బారావుకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
Varupula Subbarao

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు (Varupula Subbarao) రాజీనామా చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుబ్బారావుకు జనసేన కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు ఆకర్షితుడినై జనసేనలో చేరానని పేర్కొన్నారు.

Varupula-Subbarao.jpg


జగన్ హయాంలో ఇళ్లస్థలాల పేరుతో కమీషన్లు కొట్టేశారు..

ఈ సందర్భంగా సుబ్బారావు వైసీపీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో పనికి రాని భూములను ఇళ్లస్థలాల కోసమంటూ అధిక ధరలకు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నేటికి పలు స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. ఇళ్ల స్థలాల విషయంలో జగన్ విధానం సరిగా లేదని సుబ్బారావు ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 05:54 PM