Share News

నేరం చేయాలంటే భయపడాలి!

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:59 AM

‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్‌ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

నేరం చేయాలంటే భయపడాలి!

  • పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం

  • సోషల్‌ మీడియాలో విపరీత పోకడలు

  • ర్యాలీల్లో, రోడ్లపై బ్లేడ్‌ బ్యాచ్‌ల హడావుడి

  • ఇష్టారాజ్యం చేసేందుకు నేతలకు లైసెన్స్‌ లేదు

  • హద్దులు మీరేవాళ్లకు అడ్డుకట్ట వేయండి

  • పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశం

  • 1650 మంది పోలీసులతో వర్చువల్‌గా భేటీ

గ్రూప్‌-1 వంటి ప్రతిష్ఠాత్మక పరీక్షను నాడు అడ్డగోలుగా నిర్వహించారు. మూడు సార్లు పేపర్లు దిద్దడం అంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వీళ్లిప్పుడు డీఎస్సీపై యాగీ చేస్తున్నారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా? వీళ్ల నిర్వాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆధారాలతో అసెంబ్లీలో తిప్పికొట్టాలి.

- సీఎం చంద్రబాబు


ప్రభుత్వానికి పోలీసు శాఖ కీలకం. పోలీసులకు స్వేచ్ఛ ఇస్తున్నా. యూనిఫామ్‌ గౌరవం పెంచేలా చర్యలు చేపడతాం. టెక్నాలజీ, నాలెడ్జ్‌, బెస్ట్‌ ప్రాక్టీసె్‌సను సమర్థంగా అమలు చేయండి. ఏపీ పోలీస్‌ కీర్తి దేశమంతా మార్మోగాలి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసుల వైపు జరిగిన తప్పిదం కీలకంగా మారింది. ఘటనాస్థలిలోని రక్తపు మరకలను నీటితో కడిగే ప్రయత్నం చేశారు. నేరస్థుల పట్ల పోలీసులు ఎప్పుడూ ఉదాసీనంగా వ్యవహరించ కూడదు’’ అని స్పష్టం చేశారు. డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డ్రగ్స్‌ వద్దు బ్రో... ప్రచారాన్ని విస్తృతం చేయాలన్నారు. రాజకీయ పార్టీల ముసుగులో కొందరు గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహించారు. ‘‘ఇబ్రహీంపట్నం ర్యాలీలో బైకుల విన్యాసాలు, విశాఖలో రోడ్డు బ్లాక్‌ చేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడం.. శ్రీకాకుళంలో మహిళా ఎస్‌ఐపై దాడి... ఇలాంటివాటిని సహించరాదు. నేతలకు ఇష్టారాజ్యంగా వ్యవహరించే ప్రత్యేక లైసెన్స్‌ ఏదీ లేదు’’ అని చెప్పారు.


అమరావతి, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): ‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్‌ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మారుతున్న నేరాల తీరు తెన్నులతోపాటే పోలీసింగ్‌ కూడా మారాలన్నారు. డీజీపీ నుంచి పోలీస్‌ స్టేషన్‌ అధికారి వరకూ 1650 మంది పోలీసులతో మొదటి సారి శాంతిభద్రతలపై సీఎం బుధవారం వర్చువల్‌గా సమీక్ష నిర్వహించారు. ‘సోషల్‌ మీడియాలో విపరీత పోకడలు కొత్త సవాళ్లు విసురుతున్నాయి.


సోషల్‌ మీడియాలో హద్దు దాటితే...

సోషల్‌ మీడియా ప్రభావంతో కొందరు నేరస్థులుగా మారుతున్నారని చంద్రబాబు చెప్పారు. మరికొన్ని చోట్ల రౌడీలే సోషల్‌ హీరోలుగా రూపాంతరం చెందుతున్నారన్నారు. ‘‘సమాజంలో అలజడులకు తావు లేకుండా అత్యంత వేగంగా పోలీసింగ్‌ చేపట్టాలి. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యున్నత స్థానంలో నిలపాలన్నదే నా లక్ష్యం’’ అని తెలిపారు. ఇకపై ప్రతినెలా పోలీస్‌ ఫెర్ఫార్మెన్స్‌ రిపోర్టు విడుదల చేసి బెస్ట్‌ ప్రాక్టిసె్‌సను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీజీపీకి సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. సచివాలయ మహిళా పోలీసుల్లో ఉన్నత విద్యావంతులు ఉన్నారని.. వారి సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు కోరారు. విజయనగరం జిల్లాలో ఇటీవల జరిగిన కీలక కేసుల ఛేదనలో పోలీసు జాగిలాలు రుద్ర, లవ్లీల పాత్ర గురించి ఎస్పీ దామోదర్‌ వివరించగా... సీఎం అభినందించారు. సమీక్షలో హోం మంత్రి అనిత, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ప్రత్యక్షంగా.. జిల్లాల ఎస్పీలు, ఎస్‌హెచ్‌వోలు వర్చువల్‌గా పాల్గొన్నారు.


వార్తలు కూడా చదవండి...

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం

నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 06:59 AM