Share News

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:29 PM

ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సమీక్షించారు.

సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం - నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో భూగర్భజలాల పెంపు, జలధార, జల హారతి కార్యక్రమాల గురించి ఈ సమీక్షలో అధికారులతో చర్చించారు.


మార్చిలోగా ఆ పనులు పూర్తి చేయాలి..

ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 , అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ లైనింగ్ 76 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు. కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ పనులు ఈ ఏడాది జూన్ కల్లా పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఆర్ అండ్ ఆర్‌‌కి సంబంధించి 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ కల్లా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో మొత్తం 38,060 నిర్వాసిత కుటుంబాలకు, ఇప్పటివరకు 16,763 కుటుంబాలను తరలించినట్లు చెప్పుకొచ్చారు.


వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలి..

ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 ఏప్రిల్‌కు 12,779 కుటుంబాలు తరలించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం అయినట్లు వెల్లడించారు. మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెలిగొండ స్టేజ్-1కు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 74 శాతం, టన్నెల్ 2 బెంచింగ్ 94 శాతం, లైనింగ్ 66 శాతం, ఫీడర్ కెనాల్ రిటైనింగ్ వాల్ కాంక్రీట్ 84 శాతం, లైనింగ్ 8 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. పురోగతిలో తీగలేరు కెనాల్ హెడ్ రెగ్యులేటర్ గేట్లు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, డైవర్షన్ రోడ్ పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం వెలిగొండ పనులు జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి రూ.2,042 కోట్లు వ్యయం కానుందని అంచనా వేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు

మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం

కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 15 , 2026 | 12:42 PM