Share News

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 12 , 2026 | 08:41 PM

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.

బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తాం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): బీచ్‌శాండ్‌ మినరల్స్‌కు మరింత ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ ఎండీ కరణ్ అదానీ నేతృత్వంలోని బృందంతో సీఎం చంద్రబాబు ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు.


అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి..

రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి రాకుండా రాష్ట్రంలోనే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇందుకు అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.16 వేల కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ టైటానియం ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా ఏయే ఉత్పత్తులు వస్తాయో.. వాటిని ఏయే రంగాల్లో వినియోగిస్తారని సీఎం చంద్రబాబు ఆదానీ సంస్థ ప్రతినిధులను అడిగారు. వాటికి ఉన్న డిమాండ్ ఆధారంగా ఆయా అంశాల గురించి అదానీ ప్రతినిధుల బృందం సీఎంకు వివరించింది.


వార్తలు కూడా చదవండి...

వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 12 , 2026 | 09:59 PM