Share News

క్వాంటం టెక్నాలజీలో ఏపీ చారిత్రాత్మక అడుగు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Apr 14 , 2026 | 02:57 PM

ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని ప్రారంభించామని పేర్కొన్నారు.

క్వాంటం టెక్నాలజీలో ఏపీ చారిత్రాత్మక అడుగు: సీఎం చంద్రబాబు
CM Chandra babu Naidu

అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. భారత్‌లో తొలి క్వాంటం రెఫరెన్సు ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్, డీఎస్టీ సహా వేర్వేరు క్వాంటం కంపెనీల ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్‌లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ రెండు క్వాంటం టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలా సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ రెండు కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రెఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రం ఏపీ అని అభివర్ణించారు. వీటితో క్వాంటం కంప్యూటర్ హా‌ర్డ్‌వేర్‌ను పరీక్షించి సర్టిఫై చేసే సామర్థ్యాన్ని అమరావతి క్వాంటం వ్యాలీ సమకూర్చుకున్నదని చెప్పుకొచ్చారు. ఈ రెండు చోట్లా మైనస్ 273 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో పనిచేసే క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్‌లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. క్వాంటం కంప్యూటర్ ఉపకరణాల తయారు చేసే కంపెనీలు, పరిశోధకులు, విద్యార్థులు, నిపుణులకు ఉపయోగపడేలా క్వాంటం టెస్ట్ బెడ్స్ ఉండనున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీని పరిశీలించిన సీఎం

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీని సీఎం పరిశీలించారు. క్వాంటం కంప్యూటర్ ఎలా పనిచేస్తుందనే విషయాలను క్యూబిట్ ఫోర్స్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కేవలం స్వదేశీ వస్తువులతోనే స్వదేశీ ఆపరేటింగ్ సిస్టంతో దీన్ని నడుపుతున్నట్లు వివరించారు. క్వాంటం బెడ్‌లో ఉన్న వైర్లు, చిప్‌లను టెస్టింగ్ ఫెసిలిటీలో ఉంచి పరీక్షిస్తామని సీఎంకు క్యూబిట్ ఫోర్స్ సీఈవో వెంకట్ సుబ్రమణ్యం వివరించారు. క్వాంటం కంప్యూటర్ హర్డ్‌వే‌ర్‌ను పరీక్షించాలంటే ఈ క్వాంటం రెఫరెన్స్ ఫెసిలిటీ తప్పనిసరి అని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 03:15 PM