Share News

సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి

ABN , Publish Date - Aug 06 , 2026 | 02:13 PM

సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సీడబ్ల్యూసీ స్పష్టత, అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది.

సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి
Polavaram Banakacherla Project

ఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): సీడబ్ల్యూసీ అనుమతుల తర్వాత పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు (Polavaram Banakacherla Project) కేంద్రప్రభుత్వం (Central Government) అనుమతి ఇచ్చింది. సీడబ్ల్యూసీ స్పష్టత, అంతర్రాష్ట్ర అనుమతులు పొందిన తర్వాత కొత్త ప్రతిపాదన పంపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం పంపిన 'టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్' (ToR) దరఖాస్తును అంగీకరించలేదని కేంద్ర పర్యావరణ శాఖ తెలిపింది.


అంతర్రాష్ట్ర జల వివాదాలు, సీడబ్ల్యూసీ అనుమతులు పొందాకే ముందుకెళ్లాలని EAC కమిటీ తెలిపింది. 1980 గోదావరి ట్రైబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. గోదావరి ట్రైబ్యునల్ తీర్పు 1980 ఉల్లంఘనలపై పలు ఫిర్యాదులు వచ్చినట్లు వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్లా బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.


వార్తలు కూడా చదవండి...

విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్

పవన్ కల్యాణ్ ఆదేశాలతో పులుల మరణాలపై అధికారుల ముమ్మర తనిఖీలు.. పట్టుబడ్డ పులిగోర్లు

ప్రపంచ స్థాయి క్రీడాకారులను పీవీ సింధు అకాడమీ తయారు చేస్తోంది: లోకేశ్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 06 , 2026 | 04:39 PM