పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:00 AM
స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన ఎన్నికల కోడ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. ఏపీవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో (అర్బన్ ఏరియాల్లో) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కండక్ట్ ఆఫ్ కోడ్) ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో ప్రవేశపెట్టిన ఎన్నికల కోడ్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. ఏపీవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో (అర్బన్ ఏరియాల్లో) ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (కండక్ట్ ఆఫ్ కోడ్) ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నవంబరు 7వ తేదీ రాత్రి 10:00 గంటల నుంచి ఈ ఎత్తివేత నిర్ణయం అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ముగిసిన ఎన్నికల ప్రక్రియ..
ఏపీలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ ఎస్‌ఈసీ చెప్పింది.
చీరాలలో ముగిసిన ఓట్ల లెక్కింపు..
మురసు తుఫాన్ కారణంగా వాయిదా పడిన చీరాల మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు కూడా నవంబరు 6వ తేదీ నాటికి పూర్తిగా ముగిసిందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
100 స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి..
దీంతో మొత్తంగా 100 పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, చైర్‌పర్సన్, వార్డు మెంబర్ల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తి అయిందని ఏపీ ఎస్‌ఈసీ పేర్కొంది.
గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగనున్న ఎన్నికల కోడ్..
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కానందున, ఏపీవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ యథాతథంగా కొనసాగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News