Share News

పంచాయతీ ఎన్నికల్లో ఎస్ఈసీ నయా రూల్.. ఓటర్ల చిటికెన వేలుపై సిరా గుర్తు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 04:21 PM

ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో ఎస్ఈసీ నయా రూల్.. ఓటర్ల చిటికెన వేలుపై సిరా గుర్తు!
AP SEC Anil Chandra Punetha

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Punetha) కీలక మార్గదర్శకాలను జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలుపై (Little Finger) చెరగని సిరా (Indelible Ink) గుర్తు వేయాలని పోలింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉత్తర్వుల నంబర్ - 1818/SEC-B2/2026ను నవంబర్ 13వ తేదీన విడుదల చేశారు. అదే రోజు తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయడంతో పాటే ఈ సిరా మార్పు ఆదేశాలను కూడా అమల్లోకి తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు.


ఎందుకీ మార్పు?..

సాధారణంగా ఎన్నికల సమయంలో ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేయడం ఆనవాయితీ. అయితే, ఇటీవల జరిగిన ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. అంతేకాకుండా, కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించడంతో అక్కడి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలుపై కూడా సిరా గుర్తు వేశారు.


అధికారులకు స్పష్టత..

తక్కువ వ్యవధిలోనే వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో, గత ఎన్నికల్లో వేసిన సిరా గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. పంచాయతీ ఎన్నికల సమయంలో పాత సిరా గుర్తులతో ఓటర్లను గుర్తించడంలో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడకుండా, దొంగ ఓట్లను అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఈసీ ఈ ప్రత్యేక ఉత్తర్వులను అమల్లోకి తీసుకువచ్చారు. ఇందుకనుగుణంగా పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందికి తగిన సూచనలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ఎస్ఈసీ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 05:22 PM