ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్
ABN , Publish Date - Nov 08 , 2026 | 11:30 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణ రూపొందించింది. ఈనెల(నవంబరు) 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది.
అమరావతి, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పోరుకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికల ఏర్పాట్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాచరణ రూపొందించింది. ఈనెల(నవంబరు) 13వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మొత్తం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 13 వేల 219 పంచాయతీలకు ఎన్నికలను ఎస్‌ఈసీ నిర్వహించనుంది. ఈ నెల 26, 29వ తేదీల్లో, డిసెంబర్ 2వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 13వ తేదీన మొదటి దశకు నోటిఫికేషన్, రెండోదశకు 16వ తేదీన, మూడోదశకు 19వ తేదీన నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి
జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News