ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలు జారీ
ABN , Publish Date - Sep 05 , 2026 | 06:22 PM
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కొత్త నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ (సవరణ) చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ఏపీలో మున్సిపల్ ఎన్నికల (AP Municipal Elections) నిర్వహణపై కొత్త నిబంధనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ (సవరణ) చట్టం-2026 అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 28వ తేదీ నుంచే చట్టసవరణ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో నంబర్- 210ని జారీ చేసింది. మేయర్, కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ మరో జీవో నంబర్ - 211ని పురపాలక శాఖ జారీ చేసింది. ఈ నేపథ్యంలో నామినేషన్ డిపాజిట్లను ఖరారు చేసింది. జనరల్ అభ్యర్థులకు రూ.5,000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500 డిపాజిట్ చేయాలని ఏపీ సర్కార్ పేర్కొంది.
ఒక అభ్యర్థి గరిష్ఠంగా 4 సెట్ల నామినేషన్లు మాత్రమే వేసేందుకు ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలపై నోటరీతో కూడిన అఫిడవిట్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ఓటు రద్దు చేస్తామని హెచ్చరించింది. బ్యాలెట్ పేపర్ వెనక్కు తీసుకునే సర్వాధికారాలు ప్రిసైడింగ్ అధికారికి అప్పగించినట్లు తెలిపింది. అంధులు, వృద్ధులకు ఓటింగ్ సమయంలో సాయం చేసేందుకు 18 ఏళ్లు నిండిన ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుందని వెల్లడించింది. ఓ వ్యక్తి కేవలం ఒక్క ఓటరుకు మాత్రమే సహాయకుడిగా ఉండాలనే కఠిన నిబంధనను ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News