రైతులు ఆందోళన చెందొద్దు.. ఆరుతడి పంటలకు నీరిస్తాం: మంత్రి పయ్యావుల
ABN , Publish Date - Sep 01 , 2026 | 03:25 PM
తుంగభద్ర హై లెవెల్ కెనాల్ , గుంతకల్లు బ్రాంచి కెనాల్ కింద రైతుల కష్టాలు 30 ఏళ్లుగా చూస్తున్నానని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. సాగుకు నీరు ఇవ్వడంపై చాలా కసరత్తు చేస్తామని పేర్కొన్నారు.
అనంతపురం, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర హై లెవెల్ కెనాల్ , గుంతకల్లు బ్రాంచి కెనాల్ కింద రైతుల కష్టాలు 30 ఏళ్లుగా చూస్తున్నానని మంత్రి పయ్యావుల కేశవ్ (AP Minister Payyavula Keshav) వ్యాఖ్యానించారు. సాగుకు నీరు ఇవ్వడంపై చాలా కసరత్తు చేస్తామని పేర్కొన్నారు. రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు వేయాలని చెప్పామని తెలిపారు. ముందే రైతన్నలను తమ ప్రభుత్వం అప్రమత్తం చేసిందని వెల్లడించారు. తుంగభద్ర డ్యాంకి ఉన్న 33 గేట్లు మారిస్తే అది అల్ ఇండియా రికార్డు అయిందని చెప్పుకొచ్చారు. ఈరోజు (మంగళవారం) ఐఏబీ సమావేశంలో మంత్రి పయ్యావుల పాల్గొని మాట్లాడారు. తుంగభద్ర డ్యాంకి రెండేళ్ల కిందట గేటు కొట్టుకుపోతే వెంటనే వేశామని తెలిపారు.
వెలుగొండ ప్రారంభం చరిత్రాత్మకం..
HLC కెనాల్‌పై 14 బ్రిడ్జిలు పడిపోయి.. అలాగే వదిలేస్తే.. కొత్తవి నిర్మించామని మంత్రి పయ్యావుల అన్నారు. రాష్ట్రంలో గోదావరి నీళ్లు వచ్చే చోట మినహా ఎక్కడా పంటలు వేయకూడదని తాము నిర్ణయించామని తెలిపారు. డ్రైస్పెల్ వల్ల వేస్టేజ్ అయ్యే నీరు పెరిగిపోయిందని చెప్పారు. ముందుగా తాగునీటికి నీళ్లు ఇచ్చాకే చెరువులకు ఇవ్వాలనే విషయాన్ని తాము ఆలోచిస్తామని అన్నారు. వెలుగొండ ప్రారంభం చరిత్రాత్మకమని ఉద్ఘాటించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కష్టాలు తీర్చేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. అందరూ సహకరించాలని చెప్పారు. నవంబర్ 10వ తేదీ వరకు తుంగభద్ర నీరు వచ్చేలా అధికారులు ప్లాన్ చేయాలని తెలిపారు. 80 రోజుల ప్రణాళికతో తుంగభద్ర డ్యాం నుంచి నీరు తీసుకునే వరకు ప్లాన్ చేయాలని చెప్పారు.
రైతులతో అనవసరంగా ఖర్చుపెట్టించే పనులు చేయొద్దు..
HNSS నీటిపై 4వ తేదీ అనంతరం మరోసారి చర్చిస్తామని మంత్రి పయ్యావుల అన్నారు. పీఏబీఆర్‌లో నీటి నిల్వలు తగ్గకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వరి, మిర్చి పంటలకు నీటిని ఈ సారి ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందిస్తున్నామని వెల్లడించారు. రైతులతో అనవసరంగా పైసలు ఖర్చుపెట్టించే పనులు చేయొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వచ్చిన నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వాలని అన్నారు. ఉద్యాన పంటలు ఏ విధంగా కాపాడాలో అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతుల విషయంలో ఎక్కడ బలవంతపు చర్యలు వద్దని తెలిపారు. ఈ రోజు నుంచే ఆరుతడి పంటలకు HLMC, GBC కింద నీరు విడుదల చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News