Share News

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం

ABN , Publish Date - Feb 20 , 2026 | 02:31 PM

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'శ్రీవారికి చేసిన మహాపాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు' జగన్ అని ధ్వజమెత్తారు.

దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.. జగన్ అండ్ కో పై లోకేశ్ ధ్వజం
AP Minister Nara Lokesh

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(YS Jagan Mohan Reddy) ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో నారా లోకేశ్ మాట్లాడుతూ.. ‘శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలను అక్కడే విసిరేసి వెళ్లిపోవడం క్షమించరాని పాపం. వెంకన్న స్వామితో పెట్టుకోవద్దు జగన్’ అని నారా లోకేశ్ ధ్వజమెత్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 04:22 PM