ప్రకాశం జిల్లా పాకాల బీచ్‌లో ఇద్దరి మృతి.. మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:44 PM
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగపురం నుంచి పాకల సముద్రస్నానికి 50 మంది వచ్చారు. ఈ క్రమంలో సముద్రంలో ఏడుగురు స్నానానికి దిగారు. అలల ఉధృతికి వారు కొట్టుకుపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన బృందంలోని మిగతావారు స్థానికులకు, మత్స్యకారులకు సమాచారం అందజేశారు.
వీరిలో నారాయణ, విష్ణు అనే యువకులు గల్లంతు కాగా, అలలకు కొట్టుకుపోతున్న ఐదుగురిని మెరైన్ పోలీసులు, మత్స్యకారులు కాపాడారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటినా సింగరాయకొండలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కందుకూరు తీసుకెళ్తుండగా తేజ, మహేశ్ అనే మరో ఇద్దరు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. గల్లంతైన నారాయణ, విష్ణు కోసం మత్స్యకారులు గాలిస్తున్నారు. యువకుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇద్దరు యువకులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేశ్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. గల్లంతైన వారి కోసం అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
గఫూర్ తనయుడు కిరణ్ మృతి పట్ల లోకేశ్ సంతాపం..
సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ తనయుడు కిరణ్ మృతి పట్ల మంత్రి లోకేశ్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
‘సీపీఎం నేత, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ గారి తనయుడు కిరణ్ మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అమెరికాలో సీనియర్ డేటా సైంటిస్టుగా పనిచేస్తున్న కిరణ్ ఆకస్మిక మరణం ఆ కుటుంబానికి తీరని లోటు. గఫూర్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News