ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఎన్నిక.. అభినందనలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Nov 16 , 2026 | 05:02 PM
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి పునర్నియామకం అవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
అమరావతి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి పునర్నియామకం అయ్యారు. బాలిలో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జై షా పేరును ఐసీసీ డైరెక్టర్లు ప్రతిపాదించారు. అయితే, ఐసీసీ ఛైర్మన్‌గా జై షా రెండోసారి ఎన్నికవవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.
జై షాకు సంపూర్ణ విజయం చేకూరాలి..
‘నా మిత్రుడు జై షా ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి నియమితులవడం చూసి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికవడం, క్రికెట్ ప్రపంచం మొత్తం జై షాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం. ఆయన ఎన్నిక భారతదేశానికి గర్వకారణం. ఈ క్రీడను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో జై షాకు సంపూర్ణ విజయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను’ అని లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించలేకనే మాపై జగన్ అండ్ కో అసత్య ఆరోపణలు: మంత్రి జనార్దన్ రెడ్డి
వాయుగుండం ప్రభావం.. ఏపీకి భారీ వర్ష సూచన
అంతర్జాతీయ వేదికపై ఏపీ ఖ్యాతిని జ్యోతి యర్రాజీ చాటారు: పల్లా శ్రీనివాసరావు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News