పర్యాటక రంగంలో భారత్-అమెరికా బంధం బలోపేతం: మంత్రి దుర్గేశ్
ABN , Publish Date - May 14 , 2026 | 06:19 PM
పర్యాటక రంగంలో భారత్ - అమెరికా బంధం బలోపేతమవుతోందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రి దుర్గేశ్‌తో ‘యూఎస్-ఇండియా స్ట్రాటెజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్’ భేటీ గురువారం జరిగింది.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): పర్యాటక రంగంలో భారత్ - అమెరికా బంధం బలోపేతమవుతోందని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమెరికా పర్యాటక పెట్టుబడులే లక్ష్యంగా సచివాలయంలో మంత్రి దుర్గేశ్‌తో ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్’ భేటీ ఈరోజు (గురువారం) జరిగింది. రాష్ట్ర పర్యాటక సంస్కరణలపై ప్రశంసలు – అమెరికా ఇన్వెస్టర్ల దృష్టికి ఏపీ పర్యాటక రంగం విధానాలను తీసుకెళ్తామని వెల్లడించారు. ఏపీని గ్లోబల్ టూరిజం హబ్‌గా మార్చే ప్రక్రియలో ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతో కీలకమని ప్రకటించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో విదేశీ పెట్టుబడులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భారత్ - అమెరికా 75 ఏళ్ల మైత్రిపై మంత్రి దుర్గేశ్‌కి ప్రత్యేక పుస్తకం అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
Read Latest AP News And Telangana News And International News And Telugu News