Share News

అమరావతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వేగం పెంచాలి: మంత్రి గొట్టిపాటి

ABN , Publish Date - May 25 , 2026 | 07:13 AM

అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.

అమరావతిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో వేగం పెంచాలి: మంత్రి గొట్టిపాటి
AP Minister Gottipati Ravi Kumar

అమరావతి, మే 25 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ (Gottipati Ravi Kumar) ఆరా తీశారు. క్షేత్రస్థాయి అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, విద్యుత్ పునరుద్ధరణ పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈదురుగాలుల కారణంగా చెట్లు, భారీ డిస్‌ప్లే హోర్డింగ్‌లు విద్యుత్ స్తంభాలపై పడినట్లు అధికారులు.. మంత్రికి వివరించారు. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు దెబ్బతిని సరఫరా నిలిచిపోయిందని తెలిపారు.


ప్రమాదాలు జరగకుంగా జాగ్రత్తలు తీసుకోవాలి..

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను అత్యవసరంగా చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను.. మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. ఎక్కడికక్కడ దెబ్బతిన్న లైన్లను క్లియర్ చేస్తూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనుల సమయంలో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని, తెగిపోయిన విద్యుత్ తీగల దగ్గరకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 25 , 2026 | 07:18 AM