Share News

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటాం: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Oct 28 , 2026 | 08:51 PM

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో సహాయక, పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశామని స్పష్టం చేశారు.

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు పూర్తి అండగా ఉంటాం:  హోం మంత్రి అనిత
AP Home Minister Anitha

అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ బాధితులకు తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) భరోసా కల్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షణలో సహాయక, పునరుద్ధరణ చర్యలు వేగవంతం చేశామని స్పష్టం చేశారు. ఈరోజు (బుధవారం) అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోం మంత్రి అనిత పర్యటించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎంపీలు సానా సతీశ్, హరీశ్, ఎమ్మెల్యే ఆనందరావుతో కలిసి సహాయక చర్యలపై సమీక్షించారు. అలాగే, విద్యుత్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఫిషరీస్, తదితర శాఖల అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు పృథ్వీ తేజ్ ఐఏఎస్, APEPDCL సీఎండీ, సూర్యసాయి ప్రవీణ్ చంద్ ఐఏఎస్ JMD AP TRANSCO, జాయింట్ కలెక్టర్ నిడియా దేవి పాల్గొన్నారు.


అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని హోం అనిత సూచించారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 140 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. కోనసీమ జిల్లాలో 94 మిల్లిమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో ఇద్దరు మృతిచెందారని అన్నారు. సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం అయ్యాయని చెప్పారు. పట్టణాల్లో గురువారం సాయంత్రానికి విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా చర్యలు చేపట్టామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పుకొచ్చారు. అమలాపురం మున్సిపాలిటీలో 1,400 చెట్లు నేలకొరగడంతో తక్షణ చర్యలు చేపడతామని అన్నారు. NDRF, SDRF, పోలీసు, అగ్నిమాపక బృందాలతో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.


తుఫాన్‌తో కొబ్బరి, అరటి తోటలకు భారీ నష్టం..

1.18 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేశామని హోం మంత్రి అనిత వివరించారు. తుఫాన్‌తో కొబ్బరి, అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రేపటి నుంచి వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టాల గణన వేస్తామని చెప్పారు. ఉప్పాడ సహా తీర ప్రాంతాల్లో సుమారు 450 మత్స్యకార బోట్లు దెబ్బతిన్నట్లు అంచనా వేశామని అన్నారు. బాధిత రైతులు, మత్స్యకారులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని మాటిచ్చారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు.. అధికారుల సూచనలు పాటిస్తూ సహాయక చర్యలకు సహకరించాలని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్నబ్ తుఫాన్ పునరావాస శిబిరాల్లో ఆహారం, తాగునీరు సిద్ధం చేయండి: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ఆర్న‌బ్ తుఫాన్‌ ప్రభావం.. ఏపీ ప్రభుత్వం స‌ర్వ‌త్రా అప్ర‌మ‌త్తం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 09:51 PM