Share News

స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం

ABN , Publish Date - Oct 27 , 2026 | 04:08 PM

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ఎన్డీఏ కూటమి నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ మంగళవారం ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూటమి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

 స్థానిక ఎన్నికల్లో కూటమి ధర్మం పాటించాల్సిందే.. శ్రేణులకు చంద్రబాబు, పవన్, మాధవ్ దిశానిర్దేశం
Local Body Elections

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ ఎన్డీఏ కూటమి నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు వీవీఎన్ మాధవ్ ఈరోజు (మంగళవారం) ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా కూటమి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అగ్రనేతలు కూటమి శ్రేణులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ ద్వారా కూటమి నేతలకు, కార్యకర్తలకు స్థానిక ఎన్నికలపై ఓ క్లారిటీ ఇచ్చారు.


కూటమి పార్టీల అధికారిక అభ్యర్థులను గెలిపించాలని.. ఒకటికి రెండుసార్లు ఉమ్మడి మీడియా సమావేశంలో చంద్రబాబు, పవన్, మాధవ్ సూచించారు. కూటమి పార్టీల బీ-ఫారాలు పొందిన అభ్యర్థులను గెలిపించేందుకు మూడు పార్టీల లీడర్లు, కేడర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏపీ అభివృద్ధి కోసం కూటమి ధర్మాన్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు పార్టీల నుంచి బీ-ఫారాలు ఇవ్వకుండా పోటీకి దిగాలనుకునే వారు వెంటనే నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. అధికారికంగా బీ-ఫారాలు అందిన అభ్యర్థులకు సహకరించాలని దిశానిర్దేశం చేశారు.


పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా కూటమి నాయకత్వాల ఆమోదం లేని అభ్యర్థులు ప్రకటించాలని ఎన్డీఏ పార్టీల అగ్ర నేతలు సూచించారు. కూటమి పార్టీల అధినాయకత్వాల ఆదేశాలకు భిన్నంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అవకాశాలు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ సహా ఇతర పదవుల్లో న్యాయం చేస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్ భరోసా కల్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 05:12 PM