తుఫాన్ వేళ వైద్యసేవల్లో అంతరాయం ఉండకూడదు: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Oct 25 , 2026 | 08:19 PM
అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖ అధికారులను ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అప్రమత్తం చేశారు. తుఫాన్ వేళ వైద్యసేవల్లో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అర్నాబ్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వైద్యశాఖ అధికారులను ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) అప్రమత్తం చేశారు. తుఫాన్ వేళ వైద్యసేవల్లో అంతరాయం ఉండకూడదని ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిరంతర, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండాలని దిశానిర్దేశం చేశారు. గర్భిణులు, నవజాత శిశువులు, చిన్నారులు, వృద్ధులకు ప్రత్యేక వైద్య సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అక్టోబరు 23వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య ప్రసవ తేదీ ఉన్న 26,768 మంది గర్భిణుల తరలింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
రోగుల తరలింపులో ఆలస్యం చేయొద్దు..
వరద ముప్పు ప్రాంతాల్లోని గర్భిణులు, హై రిస్క్ గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు తరలించాలని మంత్రి సూచించారు. ఆస్పత్రుల్లో మందులు, ఆక్సిజన్, జనరేటర్లు, అత్యవసర పరికరాలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. 108, 104, 102 వాహన సేవలతో సమన్వయం చేసుకోవాలని.. రోగుల తరలింపులో ఆలస్యం చేయొద్దని ఆదేశించారు. తాగునీటి భద్రత, పారిశుద్ధ్యంపై నిఘా ఉంచాలని అన్నారు. అంటువ్యాధులు, పాముకాట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ సన్నద్ధత, వైద్య సేవల నిరంతర నిర్వహణ బాధ్యత జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులదేనని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News